కోదాడ, ఏప్రిల్ 21 : జేఈఈ మెయిన్స్ సెషన్- 2 ఫలితాలను సోమవారం ఎన్టీఏ విడుదల చేసింది.ఈ ఫలితాల్లో కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన మొక్క చరణ్ సాయి 99.56 పర్సంటైల్ సాధించి జాతీయస్థాయిలో 1,583, చిలుకూరు భాను శంకర్ 98.76 పర్సంటైల్ 5,225, ఐ.కృష్ణ చరణ్ 97.25 పర్సంటైల్ సాధించి 6,274 ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు వివిధ కేటగిరి విభాగాల్లో గుండ్లపల్లి రమ్యశ్రీ (ఈడబ్ల్యూఎస్) 431, చింతకాయల కార్తీక్ 1,489 (ఓబిసి), బానోతు గణేష్ 6,148, ఎం.సంజీవ్ 9,132 జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు.
కళాశాలకు చెందిన 100 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు రేస్ విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో తమ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరచడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.