నల్లగొండ రూరల్, ఆగస్టు 22 : ఈ నెల 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను శుక్రవారం నల్లగొండ పట్టణంలోని బీపీ మండల్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్ హాజరై మాట్లాడారు. ఈ 25న సోమవారం ఉదయం 10 గంటలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తలపెట్టే సత్యాగ్రహ దీక్షకు నల్లగొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన అల్లివేణి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ, కోశాధికారి జేరిపోతుల రమేశ్ గౌడ్, అధికార ప్రతినిధి పుట్టా వెంకన్న గౌడ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునస ప్రసన్న కుమార్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు బక్కతట్ల వెంకన్న యాదవ్, పున్న రవీందర్, జిల్లా కార్యదర్శి కుకుడాల ఏడుకొండలు, వల్లకీర్తి శ్రీనివాస్, వడ్డేబోయిన రామకృష్ణ, ఏ.తిరుపతయ్య గౌడ్, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీశ్ యాదవ్, బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భరద్వాజ్, యూత్ టౌన్ ప్రెసిడెంట్ అంబటి శివ, హరిబాబు, కస్తూరి రవీందర్, అరవింద్ గౌడ్, పలనాటి మోహన్, బాత్క సతీశ్ యాదవ్ పాల్గొన్నారు.