మునగాల, మే 29 : రైతులకు నాణ్యమైన విత్తనాలకు అందుబాటులో ఉంచాలని సూర్యాపేట జడ్పీ డిప్యూటీ సీఈఓ, మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష డీలర్లు, దుకాణదారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ వద్ద నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి రశీదు భద్రపరుచుకోవాలన్నారు.
ప్రక్క రాష్ట్రాల నుండి వచ్చే విత్తనాలను కొనవద్దని, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీలర్లు విత్తనాల ధర పట్టిని అందరికీ కనిపించేలా ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలకు అధిక ధరలకు అమ్మవద్దన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేశ్ దీన్ దయాల్, ఏఓ రాజు, డీలర్లు చలసాని ప్రసాద్‌రావు, రాజేశ్, విజయ్, రఘు పాల్గొన్నారు.