మునుగోడు, ఏప్రిల్ 25 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గుండ్లూరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో రూ.1.15 కోట్లతో బీటీ రోడ్డు వేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లగొండ రోడ్డు అడ్డరోడ్ నుంచి గుండ్లూరిగూడెం వరకు 1.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నాణ్యత పనులను పంచాయతీరాజ్ డీఈఈ నాగేశ్వర్రావు, ఏఈఈ సతీశ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగిలి నాగరాజు, సింగం నరసింహ, దండు దుర్గయ్య, మధుసుధన్ రెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.