కొండమల్లేపల్లి/గుర్రంపోడ్, నవంబర్ 30 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రుచికరమైన నాణ్యతతో కూడిన భోజనం అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. కొండమల్లేపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను శనివారం డీఈఓ బొల్లారం భిక్షపతితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే గుర్రంపోడ్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వంటగదులు, వసతులు, కూరగాయల నిల్వ గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా చారకొండ వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యతతో మెను ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. వంటల్లో నాణ్యత, శుభ్రత పాటించాలని సూచించారు. తాజా కూరగాయలు, అకుకూరలతో భోజనం వండాలని, మెనూ బోర్డులను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. రోజు వారీగా విద్యార్థులకు అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. వారి వెంట ఎంఈఓ నాగేశ్వర్రావు, కేజీబీవీ స్పెషల్ అఫీసర్ కత్తుల సరళ, ఎస్సీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శౌరి, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ డి.ఆనంద్, ఉపాధ్యాయులు అనంతరాములు, ప్రదీప్, జగన్, శ్రీనివాసులు, చిన్నయ్య, రాని, గీత, రమేశ్, సత్యనారాయణ, కేర్ టేకర్ స్వాతి ఉన్నారు.