కట్టంగూర్, అక్టోబర్ 21 : విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కట్టంగూర్ లోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాల భవనం, రికార్డులు, భోజనాన్ని పరిశీలించి విద్యార్థులను సమస్యలను అడిగి తెలుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా భోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయన వెంట తాసీల్దార్ పుష్పలత, ఎస్ఓ నీలాంబరి, ఉపాధ్యాయులు ఉన్నారు.