కట్టంగూర్, ఏప్రిల్ 17 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. గురువారం కట్టంగూర్ లోని అంబేద్కర్ నగర్ లో 2025-26 విద్యా సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
తల్లిదండ్రులు బడీడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, పథకాలు, నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అంబటివాగు, అంబేద్కర్ నగర్, పద్మశాలినగర్ లో మొదటి రోజు 25 మంది విద్యార్థుల పేర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొంక అంథోని, అబ్దుల్ గపూర్, శ్రీనివాసరెడ్డి, విఠల్ కుమార్, చిన్ని శ్రీనివాస్, లోహిత్, ఇందిరాదేవి, సీఆర్పీ రవికుమార్ పాల్గొన్నారు.