మిర్యాలగూడ, జూన్ 6: ప్రభుత్వం వ్యవసాయ భూములు, ప్లాట్ల ధరలు పెంచడంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో కొనుగోళ్లకు బ్రేక్‌లు పడ్డాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో భూ ముల ధరలు 50 నుంచి 70 శాతం పెంచడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి తగ్గింది. పట్టణంలోని ఖమ్మం రోడ్డు సాగర్ రోడ్డు పరిధిలో గజం పాత ధర రూ.27,100 ఉండగా ప్రస్తుతం రూ.40,700లకు పెంచారు. ప్రభుత్వ దవాఖాన ఏరియాలో పాత ధర రూ.23 వేలు ఉండగా ప్రస్తుతం రూ.40,700లకు పెంచారు. రెడ్డి కాలనీలో పాత ధర రూ.10,800 ఉండగా కొత్తగా రూ.18,900లకు పెంచారు.
పట్టణంలో 50 నుంచి 80 శాతం వరకు ప్లాట్ల ధరలు పెంచారు. మిర్యాలగూడ మండలంలో ఎకరం ధర రూ.6.75 లక్షలు ఉండగా రూ.10 లక్షలకు పెం చారు. వివిధ గ్రామాల్లో భూములను బట్టి 50 నుంచి 70 శాతం ధరలు పెం చారు. దామరచర్ల మండలంలో ఎకరం పాత ధర రూ.9 లక్షలు ఉండగా రూ.13.50 లక్షలకు పెంచారు. ఈ మండలంలో 50 నుంచి 70 శాతం వరకు భూముల ధరలు పెంచారు. మాడుగులపల్లి మండలంలో ఎకరం పాత ధర రూ.4లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.7.65 లక్షలకు పెంచారు. ఈ మండలంలో 50 శాతం వరకు ధరలు పెరిగాయి. వేములపల్లి మండలంలోని ఇటిక్యాలలో ఎకరం ధర రూ.6.70 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.12.60 లక్షలకు పెంచారు. ఈ మండలంలో 30 నుంచి 55 శాతం భూములు ధరలు పెరిగాయి. అడవిదేవులపల్లి మండలంలో ఎకరం పాత ధర రూ.5.25 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ. 7.80 లక్షలకు పెంచారు. ఈ మండలంలోనూ 50 శాతం ధరల పెంచారు.
నకిరేకల్ మున్సిపాలిటీలో గజం ధర గరిష్టంగా రూ.4,400
నకిరేకల్, జూన్ 6: భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం పెంచిన భూ ముల ధరలు ఈ నెల 5 నుంచే అమలులోకి వచ్చిన విషయం విదితమే. నకిరేకల్ మున్సిపాలిటీలోని 20 వార్డులు, 17 పంచాయతీల్లో భముల ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. భూముల ధరలు పట్టణంలో ఎక్కువ, గ్రామా ల్లో తక్కువ పెరిగాయి. మున్సిపాలిటీలో గరిష్టంగా గజం ధర రూ.4,400, గ్రామాల్లో రూ.500 పెరిగాయి. మున్సిపాలిటీలోని నకిరేకల్-తిప్పర్తి రోడ్డులో గతంలో గజం రూ.5,800 ఉండగా ప్రస్తుతం రూ.10,200 , కడపర్తి రోడ్డులో కెనాల్ ఎదుట రూ.5,800 నుంచి రూ.8,700, కెనాల్ తరువాత రూ.5,800 నుంచి రూ.6,300, మూసీ రోడ్డులో గజం ధర రూ.5,800 నుంచి రూ.10, 200, ఇనుపాముల బైపాస్ నుంచి పద్మానగర్ బైపాస్ వరకూ మెయిన్‌రోడ్డులో రూ.7,800 నుంచి రూ.13,700, మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో గతంలో గజం ధర రూ.600 ఉండగా ప్రస్తుతం రూ.1,100 పెంచారు. భూముల ధరలు 90 శాతం పెరిగినట్లు సబ్ రిజిస్ట్రార్ అనూష చెప్పారు.
నల్లగొండలో గజం భూమి ధర రూ.40,700
నీలగిరి, జూన్ 6: నల్లగొండ పట్టణంలో గజం ధర రూ.40,700లకు పెం చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణంలో భూముల ధరలను మూడు విభాగాలుగా విభజించారు. కమర్షియల్, రెసిడెన్సీ, అపార్ట్మెంట్ అంటూ ధరలు పెంచేశారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. 50 నుంచి 100శాతం ధరలు పెంచారు. కార్పొరేషన్‌లోని ప్రధా న రహదారులు, కాలనీల్లో ఎక్కువ శాతం పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక మోస్తరులో పెరిగాయి. వ్యవసాయ భూములకు 50 నుంచి 60 శాతం మార్కెట్ విలువ పెంచారు. పెరిగిన మార్కెట్ పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి.
నల్లగొండ పట్టణాన్ని కమర్షియల్, రెసిడెన్సియల్గా నిర్ణయిస్తూ 519 ప్రాంతాల్లో ధరలు పెంచారు. అత్యధికంగా ప్రకాశంబాజర్లో రూ.40,700 కాగా అత్యల్పంగా వీలిన గ్రామాల్లో రెసిడెన్షియల్ ఏరియాలో రూ.2,600 ధర నిర్ణయించారు. ప్రకాశంబజార్‌లో మూడు భాగాల్లో అత్యధికంగా కమర్షియల్ ఏరియాలో మడిగెలు రూ.40,700 మార్కె ట్ విలువలో ప్రకాశంబజార్ మొయిన్ రోడ్డు, మడిగెలు, తిరుమల కార్నర్‌ను కేటాయించారు. ఉరబ్ మేళాలో రూ.26 వేలు కాగా అనంద్‌నగర్, వాల్మికినగర్లో రూ.4,200, బోట్టుగూడలో రూ.4,800లుగా నిర్ణయించారు. మరో స్లాట్‌లో రూ.39,600 ప్రకాశంబాజార్లోని బేకరి నుంచి పాత కలెక్టరేట్ వరకు, గుండగోని మైసయ్య విగ్రహం నుంచి ప్రకాశంబజార్‌లోని బేకరీ వరకు నిర్ణయించారు.
క్లాక్‌టవర్ కేంద్రంగా చుట్టూ ప్రధాన రహదారులు కమర్షియల్ ధర రూ.32 వేలుగా నిర్ణయించారు. క్లాక్‌టవర్ సెంటర్ నుంచి ఆర్పీ రోడ్డు డీఈ వో కార్యాలయం సమీపంలోని అల్పాస్కూల్, పాత కలెక్టరేట్ ఏరియా, న్యూ ప్రకాశంబజార్, గోదాం ఏరియాలు కేటాయించారు. రూ.26,400 పెద్ద గడియారం నుంచి బస్టాండ్ మీదుగా గోల్లగూడెం వరకు, రైల్వేట్రాక్ వరకు హైదరాబాద్ ఏరియా, డీఎస్పీ కార్యాలయం ఏరియా, ఫైర్ స్టేషన్ ఏరియా, డీఈవో కార్యాయలం ఎదురుగా మిర్యాలగూ రోడ్, మాజ్ కాంప్లెక్స్, ఎన్జీవోస్ భవన్, వస్త్రలత బజార్, ఊరబ్ వీధులను నిర్ణయించారు. ఈ ఏరియాలో రెసిడెన్సియల్‌కు రూ.14 వేల నుంచి 20 వేల వరకు నిర్షయించారు. రూ.21,300 డీఈవో ఆఫీస్ నుంచి సెయింట్ అల్పోస్ స్కూల్ వరకు నిర్ణయించారు. రెసిడెన్షియల్ ఏరియాలకు మాత్రం రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు నిర్ణయించారు.