శాలిగౌరారం, జూలై 19 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కను నాటి నీళ్లు పోశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, పీసీసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, తాసీల్దార్ జమారొద్దీన్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, చింత ధనుంజయ్య, అశోక్‌రెడ్డి, భూపతి అంజయ్యగౌడ్ పాల్గొన్నారు.