చండూరు సెప్టెంబర్ 01 : గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చండూరు మండల పరిషత్ సూపరింటెండెంట్ నరసింహకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో 166 వార్డుల్లో డ్రైనేజీలు, సిసి రోడ్లు లేవన్నారు. సీజనల్ వ్యాధులు విజృంభించకుండా దోమల మందులు స్ప్రే చేయాలన్నారు. అదేవిధంగా గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలన్నారు.
గతంలో నడిచిన పల్లె వెలుగు బస్సులు అన్ని గ్రామాలకు నడిపించాలని కోరారు. కరెంట్ లూజ్ లైన్లు ఉన్న గ్రామంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, మోగుదాల వెంకటేశం, కొత్తపల్లి నరసింహ, నారపాక శంకరయ్య, గౌసియా బేగం, బొమ్మరగోని యాదయ్య, శ్రీహరి, వెంకన్నపాల్గొన్నారు.