చండూరు, సెప్టెంబర్ 07 : కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజావాణిలో భాగంగా చండూరు ఆర్డీవో వందనపు శ్రీదేవి, ఎంపీడీవో బండారు యాదగిరికి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు,13 డిక్లరేషన్లు, 6 ఆరు గ్యారెంటీ ల పేరుతో నమ్మించి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికి 1000 రోజులైనా ఒక్క హామీను కూడా పూర్తిగా అమలు కాకపోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు. వారం రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూపాయలు 2500 ఆర్థిక సహాయం, తులం బంగారం స్కూటీ అందించాలని అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని, రైతన్నలందరికీ ప్రతి పంటకు భరోసా, కొరత లేకుండా ఎరువుల పంపిణీ, పంటకు బోనస్,24 గంటల నిరంతరం విద్యుత్ అందించాలని కోరారు. రైతు కూలీలకు సంవత్సరానికి రూపాయలు 12,000 సహాయం అమలు చేయాలని డిమాండ్స్ చేశారు.
ఇంటి స్థలంతో పాటు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని అన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగం జాబ్ క్యాలెండర్, అమలు చేయాలని కోరారు. విద్యార్థులకు విద్యా భరోసా, పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించాలి. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు హామీ ఇచ్చిన పెన్షన్ అమలు చేయాలి. ఆటో అన్నలకు ఏడాదికి రూపాయలు 12,000 అందించాలని డిమాండ్ చేశారు. బిసి, ఎస్సి, మైనార్టీ, విద్యార్థి, యువజన, రైతులకు ఇచ్చిన అన్ని డిక్లరేషన్ల హామీలను అమలు చేయాలని అన్నారు. అన్ని గ్రామాలలో, పట్టణాలలో పారిశుధ్య నిర్వహణ ఆగిపోయి మురికి కంపుతో గ్రామాలు మునిగిపోయాయని వెంటనే పారిశుద్ధి నిర్వహణ తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని ప్రశ్నించిన ప్రజలను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఇలాంటి చర్యలు తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చండూరు పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, చండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, మాజీ కౌన్సిలర్ అన్నపర్తి శేఖర్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, సామ సుజాత యాదవ రెడ్డి, కొండ్రెడ్డి మధు, సర్పంచులు గాలంక రాంబాబు, నారపాక వసంత ధనయ్య, దామెర రాములు, బీఆర్ఎస్ నాయకులు నందికొండ నర్సిరెడ్డి, చొప్పరి దశరథ, తేలుకుంట్ల జానయ్య చిలువేరు నరేష్, రావిరాల నగేష్, వీరమల్ల స్వామి, బేరి చంద్రశేఖర్, కట్కూరి సత్తయ్య, మహమ్మద్ గౌస్మియా ,నక్క సుధీర్, కామిశెట్టి ఆంజనేయులు, వర్కాల శ్రవణ్ ,నారపాక శంకర్, ఎండి సత్తార్, ఇడికూడా శీను, భూతరాజు గిరి, జక్కలి రవీందర్ , ఏరుకొండ శేఖర్ ,బోడ మోహన్, కళ్లెం సైదిరెడ్డి, గోనే హరినాధరావు, బొమ్మరబోయిన లక్ష్మయ్య, ఇడికోజు వెంకటాచారి, మెరుగు వెంకన్న, కాసాల యాదగిరిరెడ్డి, కట్కూరి మహేష్, వర్కాల అంబేద్కర్, చొల్లేటి వెంకటాచారి పాల్గొన్నారు.

హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రజావాణిలో వినతి