మోత్కూరు, జూన్ 3 : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచులు, లారీల కొరతను నిరసిస్తూ రైతులు మండలంలోని పాలడుగు హైవే పై ఆందోళనకు దిగారు. బుధవారం గ్రామంలోని రహదారిపై రైతులు బైఠాయించి గంటకు పైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు వచ్చి రైతులను సముదాయించినా వినకుండా రహదారిపై ఆందోళన చేపట్టారు. నెలన్నర నుంచి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు మండి పడ్డారు.
గన్నీ సం చులు, లారీల కొరతకు తోడు బస్తాకు రూ.10 చొప్పున వసూ లు చేసి తమను దోచుకుంటున్నారని రైతులు వాపోయా రు. 40 కిలోల బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు పేరుతో దోచుకొని మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు పంచుకుతింటున్నారన్నారు. తక్షణమే కలెక్టర్ కాంటాలను వేగవం తం చేసి, తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఎస్హెచ్వో వెంకటేశ్వర్లు తాసీల్దార్తో మా ట్లాడి గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చూస్తామని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో రైతులతో పాటు గ్రామానికి చెందిన అఖిల పక్షాల నాయకులు పాల్గొన్నారు.