మునుగోడు, ఆగస్టు 29 : యూరియా సరఫరా పెంచి, కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మునుగోడు మండల కేంద్రంలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వద్ద నిరసన తెలిపారు. అనంతరం భారీ ర్యాలీగా తాసీల్దార్ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఇన్చార్జి తాసీల్దార్ నరేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం మాట్లాడుతూ.. షరతులు లేకుండా రైతులకు యూరియా పంపిణీ చేయాలన్నారు.
తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి, రైతాంగాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోలుగురి నరసింహ, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, సురిజి చలపతి, మందుల పాండు, తీర్పాటి వెంకటేశ్వర్లు, ఈదులకంటి కైలాస్, బెల్లం శివయ్య, దుబ్బ వెంకన్న, అయితగోని లింగస్వామి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.