మునుగోడు, సెప్టెంబర్ 15 : దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తాసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు, పెన్షదారులు నిరసన తెలిపారు. తాసీల్దార్ నరేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్ మాదిగ మాట్లాడుతూ.. వికలాంగులకు రూ.4 వేల నుండి రూ.6 వేలు, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను రూ.2 వేల నుండి రూ.4 వేలకు పెంచాలని అదేవిధంగా కదలలేనటువంటి వికలాంగులకు రూ.15 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పందుల అంజి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పందుల లక్ష్మణ్, బోయపర్తి యాదయ్య, దుబ్బ విజయభాస్కర్ రెడ్డి, ప్రభాకర్, సింగపంగ నరేశ్, వీహెచ్పీఎస్ నాయకులు సహదేవులు, దొమ్మాటి సత్యనారాయణ, మండల నాయకులు పాల్గొన్నారు.