శాలిగౌరారం, మే 30 : శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చే ప్రయాణ మార్గంలోని ఎన్జీ కొత్తపెల్లి శివారులోని కందికుంట, గారెకుంట చెరువులు జాలువారి ప్రమాదకరంగా మారాయి. దాంతో రైతు సంఘం మండల ప్రతినిధి చామల వెంకటరమణారెడ్డి, రైతులు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నీటి పారుదల శాఖ ఏఈ విక్రమ్ రైతులతో కలిసి జాలువారుతున్న ప్రధేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాలువారుతున్న నీటిని తరలించేందుకు ప్రత్యేకమైన కాల్వ నిర్మాణం కోసం ప్రతిపాధనలు తయారు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడాల రమేశ్, లోడంగి మహేశ్, సంకటి శ్రీను, లింగయ్య, ఓగోటి శంకర్ పాల్గొన్నారు.