– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి
– నల్లగొండలోని నల్లజెండాతో నిరసన ర్యాలీ
రామగిరి, జూన్ 20 : హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ రోడ్డుకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుపేట్టే ఆలోచన విరమించుకోవాలని సీఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సీఐటియూ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వరకు నల్లజెండాతో నిరసన ర్యాలీ తీశారు. అనంతరం మాట్లాడుతూ.. అమెరికన్ కాన్సులేట్ ప్రాంతంలో ఉన్న రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి వైఖరి పట్ల అభ్యంతరాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో స్వాతంత్ర సమరయోదులు, ప్రజాకవులు, ఉద్యమకారల స్మారకార్థం పెట్టుకోవాల్సిన రోడ్లు పేరును యుద్ధోన్మాది దుర్మార్గుడైన ట్రంప్ పేరు పెట్టడం మంచి కాదన్నారు.
ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హశం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండీ సలీం జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, సాగర్ల మల్లయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, జేరిపోతుల యాదయ్య, తాలూకా వెంకన్న, సుంకరబోయిన రవి, ఉంగరాల సైదులు, ప్రభాకర్ పాల్గొన్నారు.