నల్లగొండ, ఆగస్టు 3 : రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా నిలుపుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉమెన్స్ కళాశాలలో అదనపు భవనం, మున్సిపాలిటీలో కౌన్సిల్ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కంచనపల్లిలో డీ-37 కాల్వకు నీటి విడుదల చేశారు.
జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించారు. అంతకుముందు ఉదయం క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఆయా కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాలన్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగ వేటలో పడాలని సూచించారు.
యువతకు ఉపయోగపడేలా జిల్లా కేంద్రంలో రూ.20లక్షలతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నిర్మించి, హైదరాబాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ వద్ద రూ.80కోట్లతో బహుళ వసతి గృహం ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు మంచి వసతి కల్పిస్తామని ప్రకటించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ సిబ్బంది పారిశుధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
ఏఎమ్మార్పీ ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంతోనే ఎడమ కాల్వ తర్వాత ఆ కాల్వలకు కూడా నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కనగల్ మండలం రేగట్టె గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ బుర్రిశ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, అదనపు కలెక్టర్ పూర్ణచందర్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అ హ్మద్, కాంగ్రెస్ నేత గుమ్మల మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.