రామగిరి, అక్టోబర్ 18 : మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌ను ప్రభుత్వం నియమించింది. కాకతీయ యూనివర్సిటీ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్‌లో ప్రొఫెసర్‌గా పని చేసిన ఆయన 2016 జూలై 2 నుంచి 2019 జూన్ 29వరకు ఎంజీయూలో వీసీగా పని చేశారు. ఎంజీయూకు న్యాక్ హోదాతోపాటు నూతన సంస్కరణలు తీసుకురావడంలో కీలకంగా వ్యహరించారు.
సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన తిరిగి రెండోసారి ఎంజీయూకు వీసీగా రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి వీసీగా వ్యహరిస్తున్న ఐఏఎస్ అధికారి నవీన్‌మిట్టల్ నుంచి హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన వీసీ శనివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఎంజీయూకు వచ్చే అవకాశం ఉంది.