రామగిరి, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అని మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కు చేదోడుగా ఉంటూ ఎంతోమందిలో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారని గుర్తు చేశారు.
బతికి ఉంటే కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఎంతో సంతోషించే వారన్నారు. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తున్నదని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం జరిగే సందర్భం ఏదైనా జయశంకర్ సార్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ఉద్యమించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్‌యాదవ్, మాజీ ఆర్వో మాలె శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీంపాషా, మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, నాయకులు సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, కాంచనపల్లి రవీందర్రావు, న్యాయవాది జవహర్లాల్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, సింగం లక్ష్మి, తిప్పర్తి , కనగల్ మండలాల అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, అయితగోని యాదయ్య, నాయకులు కొండూరి సత్యనారాయణ, మారగోని గణేశ్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మరబోయిన నాగార్జున, పోనుగోని జనార్దన్‌రావు, పేల్ల అశోక్‌రెడ్డి, జమాల్‌ఖాద్రి, మాతంగి అమర్, షబ్బీర్, ప్రవీణ్ పాల్గొన్నారు.
గద్దర్‌కు నివాళి
ప్రజా యుద్ధనౌక గద్ధర్ ప్రధమ వర్థంతి సందర్భంగా నల్లగొండలో మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు పందుల సైదులు ఆధ్వర్యంలో జయశంకర్‌సార్, గద్దర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక ప్రజా సంఘాల నేతలు మానుపాటి భిక్షమయ్య, డోలుదెబ్బ మాలిగ యాదయ్య, నర్సింగ్ హర్షవర్ధన్, రఘు, హరి పాల్గొన్నారు.