‘వైటీపీఎస్ ప్రైవేటీకరణ విరమించుకోవాలి’
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని యాష్ ప్లాంట్, కోల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను ఉపసంహరించుకుని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, సీపీఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు.
– స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి
– సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు
దామరచర్ల, జూన్ 26 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని యాష్ ప్లాంట్, కోల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను ఉపసంహరించుకుని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, సీపీఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం దామరచర్ల మండలం వీర్లపాలెం వైటీపీఎస్ మెయిన్ గేటు వద్ద దామరచర్ల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానికులకు ఉద్యోగ కల్పన ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి పవర్ ప్లాంట్ లోని స్టేజి 1, 2 యూనిట్లకు సంబంధించి ఆపరేషన్, మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రిక్ పనులను ఉద్యోగుల కొరతను సాకుగా చూపిస్తూ రానున్న మూడు సంవత్సరాల కాలానికి గాను ప్రైవేట్ కాంట్రాక్టర్లు అప్పగించేందుకు టెండర్లను ఆహ్వానించడం సమంజసం కాదన్నారు.
ఈ నెల 12 నుండి 29 వరకు టెండర్ల గడువు ప్రకటన చేశారని విద్యుత్ సమస్యతో సతమతమవుతున్న తెలంగాణకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో గత ప్రభుత్వం వైటీపీఎస్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 4 యూనిట్లను ప్రారంభించి ప్రభుత్వ ప్లాంటును ప్రైవేటుపరం చేయడం వల్ల స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ప్రైవేటీకరణను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. చుట్టూ ఉన్న గ్రామాల ఇల్లు భూ నిర్వాసిత ప్లాంట్ ప్రభావిత గ్రామాల యువకులు నిర్వాసితులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్లాంట్ నిర్వహణకు 4,000 మంది సిబ్బంది అవసరం ఉండగా 1,262 మంది మాత్రమే ఉన్నారన్నారు,
దీంతో ఉత్పత్తి తీవ్ర ఆటంకం కలుగుతుందని, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా అవసరమైన ఉద్యోగాలు నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారని భూ నిర్వాసితులకు సుమారు 500 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. స్థానికంగా 2,000 మందికి ఉపాధి కల్పిస్తామన్న మాటలు ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించక పోగా ప్లాంట్ ను ప్రైవేటికరించే ప్రయత్నాలను ఉప సంహరించుకోవాలని, లేదంటే ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాల నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్, సిపిఐ సీనియర్ నాయకులు జమ్ముల కోటయ్య, గజ్జల లక్ష్మి, నరసింహ రెడ్డి, పెదపాక వెంకటేష్, పవన్, గాంధీ, కాశయ్య, రమేష్, సత్యానందం, సూర్యం, మహేష్ బాబు, రాము, రవి నాయక్, కృపాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

