మాడ్గులపల్లి, ఏప్రిల్ 16: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటన మండల కేంద్రంలోకి అద్దంకి హైవేపై గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తమిళనాడులోని అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున కావేరి ట్రావెల్స్ బస్సు మాడ్గులపల్లి వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోని టోల్ గేట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి క్రేన్ సాయంతో బస్సును తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. అనంతరం పోలీసులు బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనంలో హైదరాబాద్‌కు పంపించారు.