సూర్యాపేట అర్బన్, జూలై 30 : డ్రైవర్లు అప్రమత్తతతోనే ప్రమాదాలను అరికట్టవచ్చని, ఆర్టీసీ డ్రైవర్లు తాము చేస్తున్నది సమాజసేవగా భావించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రమాద రహిత వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ వ్యాప్తంగా సుమారు 1.60 లక్షల మంది మణించినట్లు గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సు లో ఎక్కువ మంది ప్రయాణిస్తారని, బస్సు ప్రమాదానికి గురైతే ప్రాణనష్టం అధికంగా ఉం డే ప్రమాదం ఉందన్నారు. అందుకే డ్రైవర్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ప్రమాద రహిత డ్రైవర్లుగా ఎంపికైన 21 మందిని ఆయన ఘనంగా సన్మానించారు. జిల్లా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ జయ ప్రకాశ్‌రెడ్డి, రీజినల్ మేనేజర్ రాజశేఖర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మాధవి, శివశంకర్, సూర్యాపేట డిపో మేనేజర్ సురేందర్, అసిస్టెంట్ మేనేజర్ సైదులు, కృష్ణయ్య, ఏకాంబర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.