– మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్, జూలై 6 : గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్రాయి పండుగలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పండుగ కార్యక్రమానికి హాజరైన ఆయన గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ దేవత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేతో పాటు ప్రజా ప్రతినిధులను, నాయకులను కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, అయిటి పాముల సర్పంచ్ బెళ్లి సుధాకర్, పామనగుండ్ల సర్పంచ్ వడ్డే మాధవి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పనస సైదులు, నల్లమాద సైదులు, వడ్డె సైదిరెడ్డి, పెద్ది బాల నర్సయ్య, గుండగోని రాములు, మల్లెబోయిన శీను, బీరెల్లి ప్రసాద్, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.