అర్వపల్లి, సెప్టెంబర్ 05 : గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సర్పంచ్ అంకిరెడ్డి వీరాంజనేయులు అన్నారు. శుక్రవారం అర్వపల్లి మండలం బొల్లంపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలు, రక్తహీనతను నివారించే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దానం పున్నయ్య, వార్డు మెంబర్లు చవ్వ సురేశ్, తీగల వాసవి నాగరాజు, ఏఎన్ఎం పార్వతి, అంగన్వాడీ టీచర్ పద్మ, ఆశ శైలజ, గోసుల విజయ్ కుమార్, బయ్యాన్న గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.