మునుగోడు, ఏప్రిల్ 19 : తెలంగాణ ప్రభుత్వం, ఐసీడీఎస్ సంయుక్తంగా పోషణ్ అభియాన్ పేరుతో ఏప్రిల్ 8 నుండి 22 వరకు పోషణ పక్షం పేరుతో మండలంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సీడీపీఓ లావణ్యకుమారి, ఏసీడీపీఓ వెంకటమ్మ మాట్లాడుతూ.. ప్రతి గర్భిణీ అంగన్వాడీ సెంటర్లో పేరు నమోదు చేసుకుని పౌష్టికాహార లోపం లేకుండా, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పుట్టేవిధంగా చూడాలన్నారు.
వెదిరె పూలమ్మ ఫౌండేషన్ సభ్యుడు వెదిరె విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లో గర్భిణులకు అందించే టాబ్లెట్స్ ను, పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకుని ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ వెంకట్ నారాయణ, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గౌస్ బాబా, అంగన్వాడీ సూపర్వైజర్లు శివేశ, నాగమణి, అంగన్వాడీ టీచర్ కళమ్మ, ఏఎన్ఎం యాదమ్మ పాల్గొన్నారు.
Munugode : గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి : సీడీపీఓ లావణ్యకుమారి
Munugode : గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి : సీడీపీఓ లావణ్యకుమారి