రాజాపేట, మార్చి 12 : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటారన్న నేపథ్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ చర్యను సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి నిరసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు చెల్లించేంతవరకు అసెంబ్లీ, సచివాలయం ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పెండింగ్ బిల్లులు రాక ఎంతోమంది మాజీ సర్పంచులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించేంత వరకు నిరసనలు తెలుపుతామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపుకు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.