ఆత్మకూర్.ఎస్, నవంబర్ 10 : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జిగా ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన గిలకత్తుల ప్రవీణ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ సోమవారం నియామక పత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్ కుమార్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా తన ఎంపికకు సహకరించిన రాష్ట్ర సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల కిరణ్ కుమార్ గౌడ్‌కు ప్రవీణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.