ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదికారులను ఆదేశించారు.
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
హుజూర్నగర్,మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదికారులను ఆదేశించారు. మంగళవారం హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పవార్‌తో పాటు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లికార్జున్,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేరుచేయాలన్నారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి స్థానికులు సహకరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి కాలనీల్లోని పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నా రు.
అనంతరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించి కిచెన్ షెడ్డు,తాగునీరు, టాయిలెట్లు, వంటశాలను పరిశీలించారు. అనంతరం 6వ తరగతి విద్యార్ధులతో తెలుగు పాఠాలు చదివించారు. అనంతరం విద్యార్ధులకు నోటు బుక్స్,పెన్నులు పంపిణీ చేశారు. స్కూల్ ఆవరణలో శిథిలావస్ధలో ఉన్న తరగతి గదులను పరిశీలించి, దానిని తొలగించి చదును చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ కవిత, ప్రధానోపాధ్యాయుడు నర్సిరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

