త్రిపురారం, జూన్ 20 : నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఎర్రబెల్లి సబ్ స్టేషన్ నుంచి వచ్చే 33 కేవీ కామారెడ్డిగూడెం ఫీడర్ లైన్లో ఉన్న లూజ్ లైన్లకు ఇంటర్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కావునా మండలంలోని కామారెడ్డిగూడెం సబ్స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని మండల విద్యుత్ ఏఈ ఎ.బాలు శుక్రవారం తెలిపారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.