నల్లగొండ సిటీ, జనవరి 20 : నల్లగొండ పట్టణంలోని పలు కాలనీలకు బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ వేణుగోపాలాచార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 12:00 గంటల నుండి మధ్యాహ్నం 4:00 గంటల వరకు 11కెవి శాంతినగర్ ఫీడర్ పరిధిలో గల శాంతినగర్, ఏఆర్ నగర్, ముషంపల్లి రోడ్, రేహమత్నగర్, హైదరఖంగూడ, ప్రియదర్శిని కాలినీ, బాలాజీ ఫంక్షనల్ హాల్, లిటిల్ ఫ్లవర్ కాలేజీ, సాయినగర్ ఏరియా కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోనున్నట్లు వెల్లడించారు. రోడ్డు విస్తరణలో 11కేవీ లైన్ షిఫ్ట్, రోడ్డు వెడల్పు కోసం కరెంట్ బంద్ చేయబడును కావున వినియోగదారులు సహకరించగలరని ఆయన కోరారు.