నల్లగొండ సిటీ, జూలై 15 : నల్లగొండ పట్టణంలోని బీట్ మార్కెట్లో గల 33 కేవీ సబ్ స్టేషన్ మెయిటనెన్స్ తో పాటు దేవరకొండ రోడ్డులో 11 కేవీ ఫీడర్ పరిధిలో చెట్లను తొలగించేందుకు పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ వేణుగోపాలచార్యులు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు టీచర్స్‌కాలనీ, మాధవరెడ్డి కాలనీ, శ్రీనగర్‌కాలనీ, హౌజింగ్‌బోర్డు, ఎన్జీకాలేజీ, మీర్‌బాగ్‌కాలనీ, సూర్యనగర్, రాక్హిల్స్కాలనీ, సాయిశ్రీకాలనీ, ఎస్ఎల్ఎన్ స్వామి కాలనీ, ఎలీషాలా కాలనీ, సూర్యలంక కాంప్లెక్స్, పూజిత అపార్ట్మెంట్, బీట్ మార్కెట్, శివాజీనగర్, సావస్కర్నగర్, గాంధీనగర్, రాంగిరి కాలనీలతో పాటు శ్రీరామ్‌నగర్ కాలనీ, రెహ్మన్బాగ్ కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోనున్నట్లు వెల్లడించారు.