నల్లగొండ సిటీ, మే 26 : కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జాతర పోస్టర్ను ఆలయ అధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 5 నుంచి 7వ తేదీ వరకు అమ్మవారి జాతర జరుగనున్నట్లు తెలిపారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకట్రెడ్డి, ఆలయ ఈఓ ధనుంజయ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రవణ్ కుమార్, ఉమామహేశ్వరరావు, దామోదర్ రావు, ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రయ్య గౌడ్, జూనియర్ అసిస్టెంట్ ఉపేందర్ రెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు.