నల్లగొండ, ఆగస్టు 26 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలభావి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోస్ట్ కార్డు లక్ష సంతకాల సేకరణలో భాగంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోస్ట్ కార్డు సంతకాల సేకరణ చేపట్టి విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్, చల్లా కోటేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను మోసం చేసే కుట్రలో భాగంగా శక్తి స్కీం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి విద్యార్థుల నోటులు మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే స్కిల్ యూనివర్సిటీలో కలిపే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విద్యార్థులను ఆదుకునే విధంగా గతంలో ఉన్నట్లే ప్రభుత్వ కళాశాలలుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి జీవో నెంబర్ 97 రద్దు చేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు కుంటిగొర్ల లింగయ్య యాదవ్, నోముల క్రాంతి, గౌతమ్ కుమార్, సందీప్, శంకర్, వెంకన్న, సైదులు, గౌతమి, స్వప్న, శ్రావణి,శ్వేతా, గీత, సౌజన్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

జీవో నెంబర్ 97 రద్దు చేయాలని లక్ష పోస్టు కార్డుల సంతకాల సేకరణ