దేవరకొండ, నవంబర్ 04 : దేవరకొండ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సేవలు గత రెండు రోజుల నుండి నిలిచిపోయాయి. దీంతో ఖాతాదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో సర్వర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోస్ట్ ఆఫీస్ సేవలు బంద్ అయ్యాయి. ఈ విషయమై అధికారులను వివరణ అడుగగా టెక్నికల్ సమస్యలు పరిష్కారం అయితేగాని సేవలు అందుబాటులోకి రావని, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని పేర్కొన్నారు.