చండూరు, డిసెంబర్ 31 : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు మరోమారు ఘోర అవమానం జరిగింది. నల్లగొండ జిల్లా బిగ్ టీవీ స్టాప్ రిపోర్టర్, చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రమేశ్ తండ్రి దశదిన కర్మను బుధవారం చండూరు మున్సిపాలిటీ అంగడిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి, రామ్‌రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డితో పాటు డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత కూడా హాజరయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టేజి పైకి వెళ్లి బోయపల్లి సురేందర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేస్తుండగా డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత స్టేజ్ పైకి వెళ్లేందుకు చూడగా చండూరు సీఐ ఆదిరెడ్డి కైలాష్ నేతను స్టేజ్ పైకి వెళ్లొద్దంటూ అడ్డుకోవడం జరిగింది. దీంతో మనస్థాపం చెందిన డీసీసీ ప్రెసిడెంట్ పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బిడ్డ కైలాష్ నేతకు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వచ్చినప్పుడు అతడికి వద్దని కోమటిరెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా తనను ఎందుకు అడ్డుకుంటున్నారని కైలాష్ నేత పోలీసులను ప్రశ్నించగా వారు దురుసుగా ప్రవర్తిస్తూ ఆయనను పక్కకు నెట్టి వేయడం జరిగింది. బీసీల ఎదుగుదలను ఓర్వలేక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా చేస్తున్నారని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది పార్టీ కార్యక్రమం కాకపోయినా ఇలా అణచివేతలకు గురిచేస్తూ బీసీల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్న మంత్రిపై బీసీ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడినే ఇంతలా అవమాన పరుస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సామాన్య బీసీల పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు. మంత్రి వెళ్లిపోయే వరకు కూడా పక్కకు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కూడా తనను స్టేజి పైకి వెళ్లకుండా చేయడంపై పున్న కైలాష్ నేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాబట్టే తనని ఇలా అవమానిస్తున్నారంటూ అక్కడ ఉన్న మిగతా నేతలకు చెప్పుకుని వాపోయారు.
బ్రేకింగ్ న్యూస్
మరోసారి బైటపడ్డ నల్గొండ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు
బీసీ బిడ్డ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతను అవమానించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నేను స్టేజ్ మీద ఉండగా వాడు రావడానికి వీలు లేదు అంటూ పోలీసులకు కోమటిరెడ్డి ఆదేశాలు
నల్గొండ జిల్లా చండూర్ మండలం… https://t.co/DFuyVOLrCM pic.twitter.com/NPJrV8EWKX
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2025