కోదాడ రూరల్, జులై 04 : వాతావరణ కాలుష్య నివారణకు మొక్కలు ఎంతగానో ఉపయోగపడుతాయని సూర్యాపేట జిల్లా పశు వైద్య, పశు సంవర్థక అధికారి డాక్టర్ డి.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ ప్రాంతీయ పశు వైద్యశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక అధికారులు ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు తొలగించి పూలు, పండ్లు, కలపను అందించే మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, సిబ్బంది అఖిల్, చంద్రకళ పాల్గొన్నారు.