పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మృతి పరేడ్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబాలను పరామర్శించి సన్మానించారు.
మిర్యాలగూడ : ప్రజా రక్షణ కోసం ఉగ్రదాడుల్లో మృతి చెందిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి అన్నారు. శనివారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐలు రాఘవేందర్, నరసింహారావు, సత్యనారాయణ, ట్రాఫిక్ ఎస్ఐ మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.