తుంగతుర్తి, అక్టోబర్ 25 : పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందాలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం సభ్యులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ తమ పాటల ద్వారా అమరులైన పోలీసుల కథనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ విజయ్, హోంగార్డు మధు, పోలీస్ కళాబృందం ఇన్చార్జి యల్లయ్య, గోపయ్య, సత్యం, చారి, గురు లింగం, కృష్ణ, నాగార్జున పాల్గొన్నారు.