కనగల్, నవంబర్ 26 : స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులకు నల్లగొండ జిల్లా కనగల్ పోలీసులు పలు సూచనలు చేశారు.
– నామినేషన్ వేయు సెంటర్లోకి అభ్యర్థి అలాగే అతడిని బలపరిచే ఇద్దరు వ్యక్తులు మాత్రమే లోపలికి రావలెను
– నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థి ర్యాలీతో రావాలనుకున్నా, సౌండ్ బాక్సుల కోసం ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి తీసుకోని యెడల ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడును
– నామినేషన్ సెంటర్కు పలు దిక్కుల్లో గీయబడిన 100 మీటర్ల పరిధిలోకి అభ్యర్థి, అతడిని బలపరిచే వ్యక్తులు తప్పా ఏ ఇతర వ్యక్తులను లోనికి అనుమతించబడదు
– నామినేషన్ సెంటర్కు ముందస్తుగా గీయబడిన 100 మీటర్ల లైన్ లోపలికి ఎటువంటి వాహనాలు అనుమతించబడవు. ఒకవేళ అభ్యర్థి ఏదైనా వాహనంలో రావాలనుకుంటే అట్టి వాహనానికి ఆర్డీఓ నుండి అనుమతి పొందవలెను
– సౌండ్ బాక్స్ ల కోసం కూడా సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందవలెను.