నీలగిరి, డిసెంబర్ 21 : అన్నెపర్తి 12వ బెటాలియన్లో నాలుగు రోజలపాటు సాగిన స్పోర్ట్స్ మీట్ మంగళవారం ముగిసింది. ఇన్డోర్, అవుట్డోర్ క్రీడల్లో నిర్వహించిన క్రీడల్లో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్నింగ్, హైజంప్, షటిల్, టగ్ ఆఫ్ వార్, జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్ తదితర క్రీడలను నిర్వహించారు. సుమారు మూడు వందల మంది పోలీసులు క్రీడల్లో పాల్గొన్నారు. క్రీడల ముగింపు సందర్భంగా కమాండెంట్ ఎన్వీ సాంబయ్య మాట్లాడుతూ క్రీడలు ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా జరిగాయన్నారు. నిరంతరం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులకు క్రీడలతో కొంత మానసిక ప్రశాంత లభిస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన వారిలో ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే బెటాలియన్ల క్రీడలకు పంపించనున్నట్లు తెలిపారు. అనంతరం విజేతలకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకన్న, అశోక్, తిరుపతి, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.