మునుగోడు, ఆగస్టు18 : తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మునుగోడు మాజీ ఎంపీపీ పోలగోని సత్యం అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా చౌరస్తాలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ..రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి ఎనలేనిదన్నారు. పేద, బడుగు బలహీనవర్గాలపై జరిగిన అన్యాయాల పైన పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు.
ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జాజుల అంజయ్య గౌడ్, గురుజ నరసింహ గౌడ్, మాదగొని నరేందర్ గౌడ్, మారగోని అంజయ్య గౌడ్, బొడ్డు నాగరాజుగౌడ్, నకరికంటి యాదయ్య గౌడ్, గురిజ రామచంద్రం గౌడ్, గుంటోజు వెంకటాచారి, దేసిడి యాదయ్య గౌడ్, మాధగోని రాజేష్ గౌడ్, ఈదులకంటి కైలాస్ గౌడ్, అయితగోని విజయ్, పంతంగి స్వామి గౌడ్, పోలగోని ప్రకాష్ గౌడ్, జాజుల స్వామి గౌడ్, జాజుల సత్యనారాయణ గౌడ్, గజ్జెల బాలరాజు గౌడ్, ఐతగోని యాదయ్య గౌడ్, అనంత సాయి, పాలకూరీ సుఖేందర్, నాతి నరసింహ, గణేష్, తదితరులు పాల్గొన్నారు.