చందంపేట, (దేవరకొండ ) : దేవరకొండ మున్సిపల్ ( Devarakonda Muncipal ) పై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ ( BRS ) పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ( Ravindra Kumar ) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలోనే దేవరకొండలో రూ. 6 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. పట్టణంలోని మురికి కాలువలు, సీసీ రోడ్డు పనులు, మిషన్ భగీరథ నీరు, స్ట్రీట్లైట్లు పనులు చేశామని వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని పేర్కొన్నారు.
సమావేశంలో పార్టీ నాయకులు బిల్యనాయక్, కిషన్ నాయక్, వడ్త్యా రమేష్ నాయక్, గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్, అంజి గౌడ్, గోపాల్, సుభాష్ గౌడ్, పల్ల ప్రవీణ్ రెడ్డి, టీవీఎన్ రెడ్డి, ఇల్యాస్ పటేల్, జానీ బాబా, శ్రీనివాస్ గౌడ్, రాజు, కృష్ణ, తులసి రామ్ ఉన్నారు.