నల్లగొండ విద్యా విభాగం (రామగిరి ), మార్చి 21 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగంలో మెరుగైన పరిశోధనలకు అనుగుణంగా అభివృద్ధి పరచిన ప్రయోగశాలను రిజిస్టార్ ప్రొఫెసర్ అల్వాల రవితో కలిసి వర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఖాజా హుస్సేన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జన బాహుల్యానికి ఉపయుక్తమైన, నాణ్యమైన పరిశోధనల అవసరాన్ని గుర్తు చేశారు.
సవాళ్లకు పరిష్కారాల దిశగా అభ్యసనం ఉత్తమ ఫలితాలను ఇస్తున్నట్లు రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రేమ్‌సాగర్, సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ వసంత, సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, విభాగ అధిపతి డా కొప్పుల సత్తిరెడ్డి, డా.ఎన్.భిక్షమయ్య, డా. చిలుకూరి రమేశ్, ఆదిరెడ్డి, వీరస్వామి, డా.రూప, డా.శివరాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
MGU : ఎంజీయూలో భౌతిక శాస్త్రం ప్రయోగశాల ప్రారంభం