కోదాడ, ఆగస్టు 19 : జీవితంలో అపురూపమైన క్షణాలను నిక్షిప్తం చేసి భవిష్యత్లో గుర్తుంచుకునే విధంగా ఉపకరించేది ఫొటోగ్రఫీ మాత్రమే అని కోదాడ ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు పిల్లుట్ల వెంకట్ అన్నారు. మంగళవారం ఫొటోగ్రాఫర్లతో కలిసి అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా కోదాడలో ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులో ఈ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫొటోగ్రాఫర్లు ఐక్యమత్యంతో తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫొటోగ్రాఫర్లకు సబ్సిడీపై కెమెరాలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్, సాయి, వంశీ, శ్యామల, సైదులు, సరిగంటి మురళీకృష్ణా, విష్ణు సైదాచారి, పసి శేఖర్ రెడ్డి, నాగరాజు, నరసింహారావు, సురేశ్, శ్రవణం, సైదా, రాంబాబు పాల్గొన్నారు.