నల్లగొండ రామగిరి, జూన్ 16 : నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, కావునా ప్రతి ఒక్కరూ యోగా ధైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాసులు అన్నారు. సోమవారం యోగా డే పోస్టర్ను ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.
నల్లగొండలో ఈ నెల 21న భారత్ స్వాభిమాని ట్రస్ట్ పతంజలి, యోగా ఆధ్వర్యంలో శివాజీనగర్ శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం సమీపంలోని ఎం.వి.ఆర్ స్కూల్ ఆవరణలో నిర్వహించే యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. యోగ ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు అంతా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీఎంహెచ్ఓ శ్రీనివాస్, జిల్లా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగా సమితి అధ్యక్షుడు నాగులపల్లి శ్యామ్సుందర్, యోగా గురువులు కరుణాకర్, పున్న వెంకటేశ్వర్లు, కంది భజరంగ్ ప్రసాద్, కోట్ల సైదులు, జినుగు వెంకట్ రెడ్డి, సింగం ప్రవీణ్, శివ, జినుగు జ్యోతి పాల్గొన్నారు.