‘సీనియర్ సిటిజన్ల స్ఫూర్తితో పన్నుల చెల్లింపునకు ముందుకు రావాలి’
నల్లగొండ నగర అభివృద్ధికి పన్నులే బలమని, సీనియర్ సిటిజన్లను ఆదర్శంగా తీసుకుని పట్టణ వాసులు పన్నులు చెల్లించేందుకు ముందుకు రావాలని నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికల కార్యాక్రమంలో..
– మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర
నీలగిరి, ఏప్రిల్ 09 : నల్లగొండ నగర అభివృద్ధికి పన్నులే బలమని, సీనియర్ సిటిజన్లను ఆదర్శంగా తీసుకుని పట్టణ వాసులు పన్నులు చెల్లించేందుకు ముందుకు రావాలని నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికల కార్యాక్రమంలో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని 48వ డివిజన్లో ట్రేడ్ లైసన్స్లు, 11, 34వ డివిజన్లో ఆస్తి పన్నుల వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తి పన్నులో ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రిబేట్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు.
బకాయిలు వాయిదా వేయొద్దు ఇప్పుడే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్లు తమ పన్నులు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వారి చైతన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ట్రేడ్ లైసెన్సుల వసూళ్లను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరి శివరాంరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

