డిజిటల్ సేవల దిశగా ఆర్టీసీ సంస్థ ఎండీ వై నాగిరెడ్డి వెల్లడి
సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే.. రోజూ వేకువజామునే లేచి ఎండనక, వాననక కోట్లా ది మంది ప్రజలను చేరవేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ మెకానిక్లు, ఇతర సిబ్బందే నిజమైన రవాణా యోధులని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ప్రశంసించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురసరించుకుని బస్ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిషరించి మాట్లాడారు.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే.. రోజూ వేకువజామునే లేచి ఎండనక, వాననక కోట్లాది మంది ప్రజలను చేరవేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ మెకానిక్లు, ఇతర సిబ్బందే నిజమైన రవాణా యోధులని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ప్రశంసించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురసరించుకుని బస్ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిషరించి మాట్లాడారు. దేశ పురోగతిలో, ప్రజాజీవనంలో రవాణా వ్యవస్థల పాత్ర అత్యంత కీలకమైనదని చెప్పారు. కాలానికి అనుగుణంగా ఆర్టీసీని ఆధునిక, పర్యావరణహిత వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం యూపీఐ, కార్డు చెల్లింపుల వంటి డిజిటల్ సేవలతో పాటు లైవ్ బస్ ట్రాకింగ్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పా రు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, పానిక్ బటన్ల ఏర్పాటును వేగవంతం చేశామని, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, విసృ్తతమైన మొకల పెంపకంతో గ్రీన్ ఆర్టీసీ దిశగా అడుగు లు వేస్తున్నామని తెలిపారు. వేడుకల్లో ఈడీలు సీహెచ్ వెంకన్న, ఎం రాజశేఖర్, ఎఫ్ఏ విజయపుష్ప, జేడీ నర్మద, సీపీఎం ఉషాదేవి, సీఎంఈ జానీరెడ్డి, సీటీఎం శ్రీదేవి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

