అర్వపల్లి, ఏప్రిల్ 16 : వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్, రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో సహజ కాన్పులు అయ్యే విధంగా గర్భిణీలకు సలహాలు, సూచనలు అందిస్తూ ప్రభుత్వం ద్వారా పొందే ప్రయోజనం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. సిబ్బంది సమయపాలన, విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భూక్య నగేశ్నాయక్, సీహెచ్ఓ మాలోతు బిచ్చూనాయక్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్ సునీత, అరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.