కట్టంగూర్, సెప్టెంబర్ 4 : వర్షాకాలంలో గ్రామాల్లోని ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కట్టంగూర్ మండల ప్రత్యేక అధికారి సతీశ్ కుమార్ అన్నారు. గురువారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారి శ్వేతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిండంతో పాటు పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, సీహెచ్ఓ నర్సింహ్మరావు, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.