అర్వపల్లి, సెప్టెంబర్ 30 : సమాజానికి ఉత్తమ సేవలను అందించే అధికారులను ప్రజలు ఎప్పుడు మరిచిపోరని జాజిరెడ్డిగూడెం ఎంపీడీవో ఝాన్సీ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలోని సూపరింటెండెంట్ రామకృష్ణ పదవీ విరమణ సందర్భంగా ఆయనను కార్యాలయ సిబ్బంది శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, జూనియర్ అసిస్టెంట్ శ్రవణ్, ఏపీఓ నాగయ్య, టీఏలు యాదమ్మ, నాగమణి, దీపిక, పీఓ సుధీర్ రెడ్డి, సర్పంచులు వల్లపు గంగయ్య, బొడ్డు ఇందిర, యాదగిరి, పంచాయతీ కార్యదర్శులు నవీన్ రెడ్డి, అశోక్, జ్యోతి, ఫరహాన, రాజశేఖర్, మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.